సందర్శకులతో పొచ్చర జలపాతం కిటకిట

Sun,August 19, 2018 06:46 PM

heavy rush at pochera waterfall in adilabad

ఆదిలాబాద్: జిల్లాలోని బోథ్ మండలంలో ఉన్న పొచ్చర జలపాతం ఇవాళ సందర్శకులతో కిటకిటలాడింది. వారాంతపు సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. జలపాతం అందాలను ఆస్వాదించారు. జాలువారుతున్న జలపాతం అందాలను సెల్‌ఫోన్, కెమెరాల్లో బంధించారు. వనదేవత, గాయత్రీమాత విగ్రహాల వద్ద ఫొటోలు దిగడానికి పోటీ పడ్డారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున జలపాతం దగ్గరి వరకు పర్యాటకులు వెళ్లకుండా రక్షణగా తాడును ఏర్పాటు చేశారు. అటవీ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

821
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles