ప్రాజెక్టులకు జలకళ.. ఫొటోలు

Sun,August 12, 2018 01:30 PM

heavy rains in telangana state

హైదరాబాద్: రెండు రోజులుగా రాష్ట్రంలో ముసురు నుంచి మోస్తరు, భారీ వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో అతి భారీ వర్షం కురిసింది. దీంతో ప్రాజెక్టులు, చెరువుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మెజారిటీ చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారి, మత్తడి దూకుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి వరదనీరు వచ్చి చేరుతుండడంతో జలకళ సంతరించుకుంటుంది. భారీ వర్షాలతో పలు జిల్లాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సింగరేణి ఓపెన్ కాస్టుల్లోకి వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతంలో భారీగా నీరు చేరింది. పర్యాటకుల భద్రతను దష్టిలో ఉంచుకొని ఆదివారం సందర్శకులను అనుమతించడంలేదని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇక చేజారిపోయాయనుకున్న పంటలు వానలతో జీవం పోసుకుంటుండగా, అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి.4881
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles