ఇవాళ, రేపు తెలుగు రాష్ర్టాల్లో భారీ వర్షాలు

Sun,July 21, 2019 10:39 AM

heavy rains expected in some areas of telangana and ap

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో ఇవాళ, రేపు తెలంగాణ, ఏపీలలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నిన్న హైదరాబాద్, వరంగల్, కర్నూల్, గుంటూరు, ప్రకాశం, నిజామాబాద్, పశ్చిమ గోదావరి, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షం పడిందని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండడం, ఆగ్నేయ బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 4 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అటు విశాఖపట్నం వాతావరణ కేంద్రం కూడా తెలిపింది.

917
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles