HomeLATEST NEWSHealthy Telangana state

ఆరోగ్య తెలంగాణ!

Published: Sun,June 2, 2019 06:25 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వైద్యరంగంలో గుణాత్మక మార్పులు తీసుకొచ్చాయి. 2019-20 బడ్జెట్‌లో వైద్య ఆరోగ్యశాఖకు ప్రభుత్వం రూ.5,536 కోట్లను కేటాయించింది. గుండె, కాలే యం, ఊపిరితిత్తులు, మూత్రపిండాల మార్పిడి, స్టెమ్‌సెల్స్ శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ ద్వారా అమలుచేస్తున్నది. ఐదేండ్లలో 95 లక్షల మంది రోగులు ఆరోగ్యశ్రీ సేవలు వినియోగించుకోగా, రూ. 3,227.57 కోట్లు ఖర్చుచేసింది. నిరుపేదలు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యం చేయించుకున్నా సీఎం రిలీఫ్ ఫండ్ కింద గరిష్ఠంగా రూ.12 లక్షల వరకు ఆర్థికసాయాన్ని అందిస్తున్నది. ఏటా కోటి మందికిపైగా ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యసేవలు అందుతున్నాయి. నలుగురు డాక్టర్లతో మండలస్థాయిలో 30 పడకల దవాఖాన, 125 సీహెచ్‌సీల్లో 24 గంటల సేవలు అందిస్తున్నారు. కొత్తగా నాలుగు వైద్య కళాశాలలు ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్ల్లో ఒక్కో బెడ్ నిర్వహణకు ప్రతినెలా సగటున రూ.5,016 ఖర్చు చేస్తున్నారు. రూ.600 కోట్లతో వైద్యశాలల కోసం కొత్త వైద్య సామగ్రిని కొనుగోలుచేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 40 డయాలసిస్ సెంటర్లు, 40 డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటుచేశారు. ప్రభుత్వ దవాఖానల్లో డెలవరీలు 33 శాతం నుంచి 49 శాతానికి పెరిగాయి. 50 బస్తీ దవాఖానలను ప్రారంభించారు. ఎంఎన్‌జే క్యాన్స ర్ దవాఖానలో రూ.100 కోట్లతో అత్యాధునిక వసతులు ఏర్పాటుచేయనున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు ఈజేహెచ్‌ఎస్ పథకాన్ని అమలు చేస్తున్నది. కంటి వెలుగు కోసం రూ.84.01 కోట్లు కేటాయించింది. 2019 మార్చి 24 వరకు 1.54 కోట్ల మందికిపైగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 22.91 లక్షల మందికి అద్దాలు అందజేశారు. కంటివెలుగు శిబిరాల మాదిరిగా ప్రజలందరికీ చెవి, గొంతు, ముక్కు, దంత పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నది. ఆయా నివేదికల ఆధారంగా హెల్త్ స్టేటస్ ఆఫ్ తెలంగాణ తయారుచేయనున్నది.
1585
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology