పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం: మంత్రి ఎర్రబెల్లి

Wed,September 11, 2019 04:59 PM

Health with Neighborhood Hygiene says Minister Errabelli Dayakar rao

మమబూబాబాద్: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నేడు జరిగింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటల రాజేందర్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్, జెడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, జిల్లా కలెక్టర్ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. అన్ని గ్రామాల పారిశుద్ధ్యం, పచ్చదనం, పరిశుభ్రత, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమానికి రూపకల్పన చేశారన్నారు. అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా నిర్వహించుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు వైద్యారోగ్యశాఖ అధికారులు అంకితభావంతో పనిచేయాలన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రభలుతున్నాయి. వీటి నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.

849
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles