కళ్లకు, గుండెకు ఎంతో మేలైన ఆహారం...

Tue,March 12, 2019 10:17 AM

health benefits of fish

మనం తీసుకునే ఆహారంతోనే ఆరోగ్యం ముడిపడి ఉంది. మంచి ఆహారం ఆరోగ్యానికి సంకేతం. సమతుల ఆహారంపై నగర, పట్టణ ప్రజల్లో కొంతమేరకు చైతన్యం పెరిగినా పల్లెల్లో మాత్రం అంతంత మాత్రమే. స్థానికంగా పుష్కలంగా లభించే చేపలు, రొయ్యలను ఆహారంలో తీసుకుంటే పోషకాహార లోపం తగ్గి ఆరోగ్య సమస్యలు దరి చేరవని నిపుణులు సూచిస్తున్నారు.

చేపలు, రొయ్యలు పోషక విలువలు ఉన్న బలవర్థక ఆహారం. మన దేశంలో లక్ష టన్నుల చేపల వినియోగం జరుగుతుండగా ఇందులో 60శాతం చేపలు సముద్రం నుంచే లభ్యమవుతున్నాయి. చేపల్లో చాలా రకాలున్నాయి. ప్రతి మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి ఏటా కనీసం 11కిలోల చేపలు, రొయ్యలను తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. మాంసాహారులు సగటున ఏడాదికి 5కిలోలు కూడా తినటం లేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.


తాజా చేపలతో ఆరోగ్యం


చేపల్లో కొవ్వు ఉండదు. తాజాగా లభించే చేపల్లో తేమ 80శాతం, మినరల్స్ 2శాతం, ప్రొటీన్లు 16.69-19.39 శాతం, కాల్షియం 250 మి.గ్రా, పాస్ఫరస్ 21-24 మి.గ్రా, ఐరన్ 3.76 మి.గ్రా, పొటాషియం 1.671, సల్పర్ 1.119 , మెగ్నీషియం 0.133 మి.గ్రా, ప్రతి వంద గ్రాముల చేప కండరంలో లభిస్తాయి. ఇవేకాకుండా జింక్, కాపర్, మాంగనీస్, బిస్మత్, క్రోమియం, సిల్వర్, బేరియం , కోబాల్ట్, సిలికాన్, రేడియం, కార్బోహైడ్రేట్లు, లైసిన్, మిథియోనిన్ ఎక్కువ. చేపల్లో విటమిన్ ఏ, డీ, బీ-కాంప్లెక్స్, బీ-12 ఎక్కువ శాతంలో ఉంటాయి. చేప కాలేయంలో బీ -కాంప్లెక్స్, విటమిన్ సీ దొరుకుతాయి.


రొయ్యల్లో..


రొయ్యలు చిన్నవైనా బలవర్థకమైనవి. రుచికరమే గాకుండా ఆరోగ్యానిచ్చేవి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొటీన్లు రొయ్యల ద్వారా పొందవచ్చు. కాల్షియం పాస్ఫరస్, ఐరన్, అయోడిన్, విటమిన్-బీ2, నికోటినిక్ ఆసిడ్ ఉంటాయి. రొయ్యలు తేలికగా జీర్ణమవుతాయి. రొయ్యల్లో 50-70 శాతం తేమ ప్రొటీన్లు, 67-80శాతం, 13.1-27.7కార్బోహైడ్రేడ్లు, కాల్షియం 470-535 మి.గ్రా, పాస్ఫరస్ 715-930, ఐరన్ 27.6-43.1 మి.గ్రా ఉంటాయి.

గుండెకు ఎంతో మేలు


చేపలు, రొయ్యలు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచూ తీసుకోవటంతో శరీరంలో కొవ్వు తగ్గడంతోపాటు బీపీ, షుగర్ రాకుండా దోహదపడుతాయి. రక్తప్రసరణ సజావుగా సాగి గుండె పనిచేసే విధానం మెరుగుపడుతుంది. తద్వారా బీపీ దూరమవుతుంది. ఎసిడిటీ రాదు. పక్కటెముకలు గట్టిపడుతాయి. క్యాన్సర్ రాకుండా దోహదపడుతాయి.

నేత్రాలకు నేస్తాలు..


చేపలు, రొయ్యలు మన నేత్రాలకు నేస్తాల్లాంటివి. వీటి వల్ల మనిషికి ఏ, డీ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. కంటిలో రెటినాకు ముఖ్యకణాలైన ఫాంటోప్సిన్, సోటోప్సిన్ శక్తి పెరిగి కంటిచూపు బాగా కనిపిస్తుంది. ఇందులో వేడి పదార్థాలు ఉంటాయి. కాబట్టి జలుబు, ఆస్తమాను తగ్గించే శక్తి చేపలకు ఉంటుంది.

తెలంగాణ ప్రభుత్వంలో మత్స్యవిప్లవం..


తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మత్య్సవిప్లవం వచ్చింది. గ్రామ గ్రామన చెరుల్లో చేపల పెంపకానికి ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తుంది. అంతేకాకుండా మత్య్సకారుల జీవనోపాధి పెంచుతుంది. దీంతో రాబోయే రోజుల్లో చేపలు పుష్కలంగా లభించి ప్రజలు బలవర్థక ఆహారం లభించనుంది.

3466
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles