విద్యతో పాటు ఆరోగ్య పరిరక్షణ ముఖ్యం : జగదీశ్ రెడ్డి

Fri,August 24, 2018 01:44 PM

Health and Hygiene Kits programme inaugurated by Minister Jagadish reddy

సూర్యాపేట : విద్యార్థినులకు విద్యతో పాటు ఆరోగ్య పరిరక్షణ కూడా ముఖ్యమని విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న కిశోర బాలికలకు ఆరోగ్య మరియు శుభ్రత కిట్లను పంపిణీ చేసే బాలికా ఆరోగ్య రక్ష పథకాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలో 317 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 24,746 మంది విద్యార్థినులకు ఈ కిట్లు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. సంవత్సరానికి నాలుగుసార్లు ఈ కిట్లు పంపిణీ చేస్తామన్నారు. ఒక్కో విద్యార్థిని మీద సంవత్సరానికి రూ. 1600లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. పుట్టిన పాప నుంచి ఆమె పెండ్లి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత తీసుకున్నారని మంత్రి స్పష్టం చేశారు.

1631
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles