రివాల్వర్‌తో కాల్చుకుని హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య

Wed,September 18, 2019 09:59 AM

నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో హెడ్‌కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ప్రకాశ్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ రివాల్వర్‌తో ప్రకాశ్‌రెడ్డి కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హుటాహుటిన నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రకాశ్ రెడ్డి మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఆత్మాహత్యాయత్నానికి గల కారణం తెలియాల్సి ఉంది. ఎస్‌ఐ తన రివాల్వర్ ను స్టేషన్ లోనే ఉంచి ఇంటికి వెళ్లినట్లుగా సమాచారం. పీఎస్ లో ఎవరూ లేని సమయంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రకాశ్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శబ్దం విని లోపలికి వచ్చే సరికి రక్తపు మడుగులో పడిఉన్నాడు.
విద్యుదాఘాతంతో దంపతులు మృతి..
వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం కుషాయిగూడెంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో దంపతులు మృతిచెందారు. భార్య గోరిభి(38), భర్త సయ్యద్ హైదర్(40) కరెంట్ షాక్‌తో మృతిచెందారు.

1652
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles