పెద్దపల్లికి చేరిన హరితహారం పరుగు..

Sun,July 30, 2017 09:41 PM

Haritha haram run reach to peddapalli

పెద్దపల్లి : ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలనే లక్ష్యంతో తిరుపతి అనే యువకుడు చేపట్టిన పరుగు పెద్దపల్లికి చేరుకుంది. ఈసందర్భంగా పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహాం వద్ద తిరుపతికి తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ సంగ్రామ్ సింగ్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. హరితహారం కార్యక్రమం విజయవంతం కావాలంటే ఉద్దేశ్యంతో తిరుపతి అనే యువకుడు హైదరాబాద్‌లోని గన్‌పార్క్ నుంచి మంథని వరకు 240కిలో మీటర్ల పరుగును శనివారం ప్రారంభించాడు. తిరుపతి చేపట్టిన పరుగును రాష్ట్ర ప్రభుత్వ అంతర్ రాష్ట్ర సలహాదారుడు డాక్టర్ వివేక్ శనివారం హైదరాబాద్‌లో జెండ ఊపి ప్రారంభించారు. శనివారం పరుగు ప్రారంభించిన తిరుపతి మధ్యాహ్నం 12గంటలకు పెద్దపల్లికి చేరుకున్నాడు. ఈసందర్భంగా తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ సంగ్రామ్ సింగ్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఘన స్వాగతం ఫలికారు. తెలంగాణ తల్లికి విగ్రహానికి పూల మాల వేసి పట్టణంలో మొక్కలు నాటారు. హరితహారం కోసం తిరుపతి చేపట్టిన విన్నూత యాత్ర ఎంతో మంది ఆదర్శంగా నిలుస్తుందని సంగ్రామ్ సింగ్ అన్నారు. కార్యక్రమంలో రాజలింగు, సదానందం, సురేష్, కృష్ణమూర్తి, ఆవుల రాజేష్, వేదశ్రీ, కమలాకర్, సాయిరాం, తోకల రమేష్, ప్రతాప్, బియ్యాల కళ్యాణ్‌తో పాటు పలువురు జాగృతి నాయకులు పాల్గొన్నారు.

2111
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles