ఆరు వేల దేవాలయాల అభివృద్ధికి కృషి: హరీశ్‌రావు

Mon,February 12, 2018 02:33 PM

Harishrao special pooja at bekkal ramalingeshwara swamy


సిద్దిపేట: రాష్ట్రంలోని ఆరు వేల దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నమని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. మద్దూరు మండలం బెక్కల్ రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఇవాళ హరీశ్‌రావు సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ బెక్కల్ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.80 లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రామలింగేశ్వర ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చేర్యాల, బచ్చన్నపేట, మద్దూర్ మండలాలకు దేవాదుల, కాళేశ్వరం జలాలు తెస్తాం. ఈ ఏడాదే ఫేజ్-1,2 కింద నీళ్లు నింపి సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు.

1252
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles