పైసా ఖర్చు లేకుండా సాదాబైనామా పట్టాలు..Wed,September 13, 2017 05:29 PM
పైసా ఖర్చు లేకుండా సాదాబైనామా పట్టాలు..


సిద్దిపేట : రైతులకు పైసా ఖర్చు లేకుండా సాదాబైనామా పట్టాలు ఇస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గజ్వేల్‌లో జరిగిన రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సుకు మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పాలనలో మండలానికొక గోదాం నిర్మిస్తున్నామన్నారు. క్రమక్రమంగా రైతుల అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు.

ఎరువుల కొరత, విత్తనాల కొరత, పోలీస్ స్టేషన్ లో ఎరువుల కోసం రైతుల లైను.. ఇదీ మనం చూసిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని హరీశ్ రావు గుర్తుచేశారు. రైతు సమన్వయ కమిటీలో ప్రతి రైతూ సభ్యుడేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ బాధ పోయిందని, నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు. రూ. 870 కోట్లతో రైతుల నుంచి ధాన్యం కొన్నామని, వెయ్యి కోట్లతో గిడ్డంగులను నిర్మించినమని హరీశ్ రావు వెల్లడించారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారిని నియమించి రైతుకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా రైతు సమన్వయ సమితులు పని చేయాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.

940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS