సీఎం ఆశీస్సులతో నిమ్మ మార్కెట్ కల నిజమైంది: హరీశ్ రావు

Sun,June 17, 2018 04:37 PM

harishrao says about lemon market in nallagonda

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో నిమ్మ, బత్తాయి మార్కెట్ ఏర్పాటు ఓ కల అని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో నకిరేకల్ లో నేడు ఆ కల నిజమైందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. నకిరేకల్ లో ఏర్పాటు చేసిన (రాష్ట్రంలో తొలి నిమ్మ మార్కెట్) ను, ప్రాధమిక వ్యవసాయ భవనం గోదామును మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..నిమ్మ మార్కెట్ రాక ముందు రైతులు ‌ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇరవై ఏళ్లయినా ఈ మార్కెట్లు వచ్చేవి కాదని హరీశ్ రావు అన్నారు. ఇరవై‌సార్లు దరఖాస్తు చేసినా మా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మ, బత్తాయి మార్కెట్ మంజూరు చేయలేదు. సీఎం కేసీఆర్ మంజూరు చేశారని ఆ పార్టీ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డే చెప్పారని హరీశ్ రావు గుర్తు చేశారు. నకిరేకల్ లో కోల్డ్‌స్టోరేజీ కావాలని ఎమ్మెల్యే వీరేశం కోరారు. కోల్డ్ స్టోరేజీ మంజూరు చేస్తున్నామని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం‌ అందుకునేది పాత వరంగల్ జిల్లా, సూర్యాపేట జిల్లానే. కాంగ్రెస్ నేతలు తమలో తాము గొడవపడటం తప్ప ప్రజల గురించి ఆలోచించడం లేదని మండిపడ్డారు. కుర్చీ కోసమే కాంగ్రెస్ కొట్లాట. కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోత, విత్తనాలు,‌ ఎరువుల కొరత అని ఎద్దేశా చేశారు. నీటి నిర్వహణ లో తెలంగాణ చక్కటి ప్రతిభ కనబరుస్తోందని కేంద్రం కితాబిచ్చిందని హరీశ్ రావు తెలిపారు.

1794
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles