అభిమానులకు హరీశ్ రావు విజ్ఞప్తి

Sun,June 2, 2019 06:04 PM

harishrao request to his fans on his birthday


హైదరాబాద్: రేపు తన పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. మిత్రులకు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు. రేపు (జూన్ 3) నా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి వస్తామని ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఙతలు. జూన్ 3న నేను హైదరాబాద్ లో కానీ, సిద్ధిపేటలోకానీ ఉండడంలేదు. వ్యక్తిగత కార్యక్రమాల్లో భాగంగా నేను దూరంగా ఉండాల్సి వస్తోంది. నా పట్ల మీ ప్రేమను.. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా చాటాలని కోరుకుంటున్నా. మీ అభిమానానికి మరోసారి తలవంచి నమస్కరిస్తున్నా. మీ అందరిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాలని హరీశ్ రావు ట్వీట్ చేశారు.9090
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles