పరమేశ్వరుని దీవెనతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి..

Mon,March 4, 2019 03:56 PM

Harishrao offers pooja at siddipet koti lingala Temple


సిద్ధిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేట ఉమాపార్థీవ కోటిలింగాల ఆలయంలో ఎమ్మెల్యే హరీశ్ రావు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శివరాత్రి పర్వదినాన్ని ప్రజలంతా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. పరమేశ్వరుని దీవెనతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు. స్వామి ఆశీస్సులతో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో సంక్షేమ ఫలాలు ప్రజలకు సమృద్ధిగా అందుతున్నాయని హరీశ్ రావు చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలని..బంగారు తెలంగాణ సాకారం కావాలని స్వామిని వేడుకున్నట్లు వెల్లడించారు.

1138
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles