అధునాతన ధోభీ ఘాట్ ను ప్రారంభించిన హరీశ్ రావు

Tue,August 28, 2018 04:08 PM

Harishrao inaugurates modern Dhobi Ghat in siddipet

సిద్ధిపేట : జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణంలో రూ.1.50 కోట్ల వ్యయంతో అధునాతన యాంత్రీకృత ధోభీ ఘాట్ ను మంత్రులు హరీశ్ రావు, జోగురామన్న ప్రారంభించారు. అనంతరం ఇద్దరు మంత్రులు బట్టలు ఇస్త్రీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, శాసన మండలి విప్, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామి రెడ్డి, రాష్ట్ర ఎంబీసీ కార్పోరేషన్ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య, మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, రజక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

1306
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS