వారసత్వ సాగునీటి కట్టడాల గుర్తింపు పట్ల హరీశ్ రావు హర్షం

Sun,September 9, 2018 01:51 PM

Harishrao Happy about heritage irrigation constructions finding

హైదరాబాద్ : కామారెడ్డి పెద్ద చెరువు, సదర్మాట్ ఆనకట్టలను కేంద్ర ప్రభుత్వం వారసత్వ సాగు నీటి కట్టడాలుగా గుర్తించడం పట్ల భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, ఈఎన్ సీ నాగేందర్ రావుహర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..వారసత్వ కట్టడాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఇటువంటి కట్టడాలు వందల సంఖ్యలో ఉన్నాయని ఈఎన్ సీ నాగేందర్ రావు తెలిపారు. తూములు, మత్తడ్లు , ఆనకట్టలు వందల సంఖ్యలో ఉన్నాయని వాటిని గుర్తించి చారిత్రిక సమాచారం, ఫోటోలు, శిలాఫలకాలు, శాసన ఆధారాలు అందించమని ఈ మేరకు ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశామని ఈఎన్ సీ నాగేందర్ రావు తెలిపారు.

2418
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles