ఎస్ఎల్ బీసీ పనులు వేగవంతం చేయండి: హరీష్ రావు

Wed,June 13, 2018 09:51 PM

Harishrao address Review on SLBC Works

హైదరాబాద్ : ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులోని శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం పనులపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. సొరంగం పనుల్లో వినియోగిస్తోన్న యంత్రం బేరింగ్ ఫెయిల్ కావడంతో గుత్తెదారు కంపెనీ జేపీ కన్ స్ట్రక్షన్ 50 కోట్ల రూపాయల అడ్వాన్స్ ఇవ్వాలని మంత్రిని కోరింది. దీంతో పాటు జీఎస్టీ మొత్తాన్ని రీ-ఎంబర్స్ చేయాలని కోరింది. ఈ విషయమై సీఎస్ ఎస్ కే జోషీతో మంత్రి హరీశ్ రావు ఫోన్ లో మాట్లాడారు. అడ్వాన్స్ చెల్లింపు, జీఎస్టీ రీ-ఎంబర్స్ మెంట్ విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సీఈ సునీల్ ను ఆదేశించారు.

టన్నెల్ పనులను వేగవంతం చేయాలని ఎజెన్సీకి మంత్రి సూచించారు. 42 కిలోమీటర్ల టన్నెల్ పనుల్లో ఇప్పటికే 30 కిలోమీటర్ల పనులు పూర్తి చేశామని, 12 కిలోమీటర్ల పనులు పూర్తి చేయాల్సి ఉందని గుత్తేదారులు మంత్రికి తెలిపారు. ఉదయ సముద్రం టన్నెల్ లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయని, 10.5 కిలోమీటర్ల టన్నెల్ పనులకు గాను 10.3 కిలోమీటర్ల పనులు పూర్తి అయినట్లు చెప్పారు. మిగతా పనులకు తెలిక మట్టి ఉన్న కారణంగా సమస్య ఏర్పడిందన్నారు. ఇలాంటి సమస్య కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో తలెత్తితే.. అక్కడ సిమ్లాకు చెందిన టన్నెల్ నిపుణుడు వి.ఎస్ చౌహాన్ తో పని చేయిస్తున్నారని.. ఆయన్ను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

అంతకుముందు నెట్టెం పాడు ప్రాజెక్టు పనులపై హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టులో భూసేకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మూడు, నాలుగు రోజుల్లో భూసేకరణపై జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోల, ప్రాజెక్టు ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. 106, 107 ప్యాకేజీలో భూసేకరణ వేగవంతం చేయాలని అధికారులకు నిర్దేశించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ప్యాకేజీ పనులు చేయకుండా ఇబ్బంది పెడుతున్న గుత్తేదారుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

1113
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS