సిద్ధిపేటలో మంత్రి హరీష్‌రావు ఆకస్మిక తనిఖీలు

Sat,June 24, 2017 11:07 AM

Harish Rao visits Komaticheruvu

సిద్ధిపేట : సిద్ధిపేట జిల్లా కేంద్రంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు శనివారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఆస్పత్రి నిర్మాణం, కోమటిచెరువు ఆధునీకరణ పనులను మంత్రి పరిశీలించారు. దసరా నాటికి ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఓపెన్ ఆడిటోరియం నిర్మాణ పనుల్లో జాప్యంపై హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సిద్ధిపేటలో నిర్మించనున్న క్లాక్‌టవర్ నమూనా పనులను మంత్రి పరిశీలించారు. కోమటిచెరువు ఆధునీకరణ పనుల వద్ద హరీష్‌రావు ఫోటో దిగారు.

1145
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles