కాంగ్రెస్‌ పరిస్థితి ఓటమికి ఎక్కువ.. డిపాజిట్‌కు తక్కువ

Tue,March 26, 2019 06:05 PM

Harish Rao Speech in Narsapur Meeting

మెదక్‌:టీఆర్‌ఎస్‌ కార్యకర్తల వల్లే తెలంగాణలో కాంగ్రెస్‌ ఖాళీ అయిందని ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. నర్సాపూర్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో పాల్గొని హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి బతుకుదెరువు లేదు. కాంగ్రెస్‌ పరిస్థితి ఓటమికి ఎక్కువ.. డిపాజిట్‌కు తక్కువ అన్నట్టు ఉంది. మాది రైతు సంక్షేమ ప్రభుత్వం. హల్దీవాగు, మంజీరను జీవనదులుగా మారుస్తాం. కాళేశ్వరం జాతీయ హోదాను బీజేపీ పట్టించుకోలేదు. మెదక్‌ ఎంపీగా ప్రభాకర్‌రెడ్డి దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలుస్తాడనే నమ్మకం ఉంది. మెదక్‌ నుంచి పోటీ చేసిన ఇందిరాగాంధీ కంటే ప్రభాకర్‌రెడ్డికి ఎక్కువ మెజారిటీ వస్తుంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదు. సీఎం కేసీఆర్‌ ఎన్ని దరఖాస్తులు ఇచ్చిన ఒక్కపైసా ఇవ్వలేదు. ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా తెలంగాణను అవమానించారని హరీశ్‌ రావు వివరించారు.

గతంలో ఇచ్చిన హామీ ప్రకారం నర్సాపూర్‌-మెదక్‌ నాలుగు లైన్ల జాతీయ రహదారి సాధించామని ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఎంపీగా మెదక్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశాను. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కొట్లాడుతామని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, జెడ్పీఛైర్‌పర్సన్‌ రాజమణి మురళీయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

2355
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles