సిద్దిపేట ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నా : హరీష్ రావు

Tue,December 11, 2018 01:13 PM

Harish Rao says thanks to Siddipeta people

హైదరాబాద్ : తనను లక్ష మెజార్టీతో గెలిపించిన సిద్దిపేట ప్రజలకు శిరసు వంచి, చేతులు జోడించి నమస్కరిస్తున్నానని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ ఎన్నికల్లో 1,20,650 ఓట్ల మెజార్టీతో తనను గెలిపించి టీఆర్‌ఎస్ చరిత్రను తిరగరాశారని కొనియాడారు. తన గెలుపును సిద్దిపేట ప్రజలకు, కేసీఆర్‌కు అంకితం చేస్తున్నానని తెలిపారు. తన గెలుపులో సిద్దిపేట ప్రజల చెమట చుక్కలున్నాయి.. ఊపిరి ఉన్నంత వరకు సిద్దిపేటకు సేవకుడిగా పని చేస్తాను. సిద్దిపేట ప్రజలు తమ కుటుంబంలో ఒకడిగా తనను చూసుకున్నారని.. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఆత్మాభిమానాన్ని చూపించారని హరీష్ రావు పేర్కొన్నారు. నాడు ఉద్యమ సమయంలో.. నేడు మెజార్టీలో సిద్ధిపేట ఢిల్లీని తాకిందన్నారు. సిద్దిపేట అభివృద్ధికి మరింత కష్టపడి పని చేస్తానని హరీష్ రావు తేల్చిచెప్పారు.

2655
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles