రిమ్మ‌న‌గూడ ప్రమాదంపై హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి

Fri,September 14, 2018 06:18 PM

harish rao On rimmanaguda Accident Pays Condolence To Victims

సిద్ధిపేట: గజ్వేల్ మండలం రిమ్మన‌గూడ సమీపంలో రహదారిపై జ‌రిగిన ప్ర‌మాదంపై మంత్రి హ‌రీష్‌రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్ర‌క‌టించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అత్య‌వ‌స‌ర సేవ‌లు అందించేందుకు నిమ్స్ ఆసుపత్రి వైద్యుల‌తో మాట్లాడిన‌ట్లు తెలిపారు. గ‌జ్వేల్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో మృతుల కుటుంబ స‌భ్యుల‌ను ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డి ప‌రామ‌ర్శించారు.


3217
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS