బీడీ కార్మికులకు జీవన భృతి మంజూరు పత్రాలు అందజేత

Tue,June 13, 2017 03:04 PM

harish rao meets with bedi workers in siddipeta

సిద్ధిపేట : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్స్ లో మంగళవారం బీడీ కార్మికులకు జీవనభృతి పథకాన్ని ప్రారంభించి, నియోజకవర్గం పరిధిలోని ఆయా మండలాల్లోని 903 మంది బీడీ కార్మికులకు జీవన భృతి మంజూరు పత్రాలను మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలను దృష్టిలో ఉంచుకొని 37 సంక్షేమ కార్యక్రమాల ద్వారా సుమారు రూ. 40వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. పీఎఫ్ ఉన్నవారిని గుర్తించి జీవన భృతి అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3,48,301 మంది మహిళలకు బీడీ కార్మికుల జీవనభృతి మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 38 లక్షల మందికి రూ. వెయ్యి నుంచి రూ.1500 లవరకు పింఛన్లు అందిస్తున్నామన్నారు. ఇలా రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి చెప్పుకొచ్చారు. బీడీ కార్మికుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బీడీ కార్మికులకు పింఛన్‌ ఇస్తున్న ఘనత మన కేసీఆర్‌కే దక్కిందన్నారు.

జీవనభృతి హర్షణీయం..
పీఎఫ్ ఉన్న బీడీ కార్మికులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవన భృతి ఇవ్వడం హర్షణీయమని బీడీ కార్మిక మహిళలలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. బీడీ కార్మిక మహిళల సంక్షేమం, అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, సహకరిస్తున్న మంత్రి హరీశన్నకు తమ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు.

744
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles