స్పీకర్ పోచారంకు హరీశ్‌రావు పరామర్శ

Sat,February 9, 2019 10:24 PM

harish rao meets speaker pocharam srinivas reddy

పాత బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో శనివారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. స్పీకర్ మాతృమూర్తి పాపవ్వ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. హరీశ్‌రావు స్పీకర్ ఇంటికి చేరుకొని పాపవ్వ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పోచారంతో మాట్లాడి ఓదార్చారు. కుటుంబీకులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. హరీశ్‌రావుతోపాటు దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి తదితరులు స్పీకర్‌ను పరామర్శించారు.

1827
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles