మినీ ట్యాంక్ బండ్‌పై మార్నింగ్ వాక్ చేసిన హరీష్ రావు

Wed,April 17, 2019 11:15 AM

Harish Rao inspected Komati Cheruvu Beautification and improvements Works

సిద్దిపేట: ప‌ట్ట‌ణంలోని కోమటి చెరువు మినీ ట్యాంక్ బండ్ పై మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు మార్నింగ్ వాక్ చేస్తూ సుంద‌రీక‌ర‌ణ‌ పనులను పరిశీలించారు. గత కొంత కాలంగా ఎన్నికల్లో బిజీ బిజీ గా ఉన్న హరీష్ రావు బుధవారం ఉదయం చెరువుని క్షేత్ర స్థాయిలో సంద‌ర్శించారు. వేసవి సెలవులు ప్రారంభం అయిన నేపథ్యంలో వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగనుందని. అడ్వేంచ‌ర్‌ గేమ్స్ వద్ద ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ పనులు త‌నిఖీ చేశారు. రాక్ గార్డెన్ , బుకింగ్ కౌంటర్, టాయిలెట్స్ పనులను పరిశీలిస్తూ.. మినీ ట్యాంక్ బండ్ పై పచ్చదనంగా ఉండాలని అధికారుల‌కు సూచించారు. మొక్కలు ఎండి పోకుండా చూడాలన్నారు. బై పాస్ రోడ్డు గేట్ వైపు పలు పనులను పరిశీలించారు. కోమటి చెరువు పై ఛార్జింగ్ వాహనం పై తిరుగుతు క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.

2505
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles