కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడుతున్నారు : హరీష్‌రావు

Sun,April 23, 2017 04:17 PM

harish rao fire on congress leaders

సంగారెడ్డి : పుల్కల్ మండలం సింగూర్‌లో నియోజకవర్గ టీఆర్‌ఎస్ కార్యకర్తలతో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే బాబు మోహన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉచితంగా ఎరువులు ఇస్తామంటే కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడుతున్నారని పేర్కొన్నారు. ఏడాదికి రైతులకు ఎకరాకు రూ. 8 వేల చొప్పున ఇవ్వబోతున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం దేశంలోనే అధిక నిధులు కేటాయించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు భారీగా నిధులు కేటాయించామని చెప్పారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడం కోసమే కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది 40 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డు స్థాయి దిగుబడి రాబోతుందని తెలిపారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. 17 శాతం తేమ ఉన్న వడ్లను కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొని రావాలని సూచించారు.

689
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles