కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీష్ రావు ఫైర్

Sat,December 3, 2016 08:23 PM

సిద్ధిపేట : కాంగ్రెస్ నేతలపై నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు దీక్ష చేపడుతామనడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలోని ఒక్క హామీని కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను అమలు చేయలేదనడం కాంగ్రెస్ నేతల రాజకీయ దివాళాకోరు తనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ నేతలు చేపట్టే దీక్ష అసూయ దీక్ష అని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం 300 అంశాలను అమలు చేసిందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్ సీఎంగా నిలిచారని తెలిపారు. కాంగ్రెస్ మాత్రం అవినీతి, కుంభకోణాల్లో నెంబర్‌వన్‌గా ఉందని నిప్పులు చెరిగారు. అవాస్తవాలు ప్రచారం చేస్తే కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

944
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles