గోదావరి జలాలతో చెరువులు నింపుతాం: హరీశ్‌రావు

Fri,May 3, 2019 10:36 PM

harish rao election campaign in siddipet

సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులు, కుంటలు నింపుతాం. త్వరలోనే రంగనాయకసాగర్ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం రాత్రి సిద్దిపేట జిల్లాలోని మిట్టపల్లి, నంగునూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పరిషత్ ఎన్నికల ప్రచార సభలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్ధతుగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతు పెట్టుబడి సాయం కింద ఎకరానికి రెండు పంటలకు గాను రూ.10 వేలు అందిస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు భృతి, ఆసరా పథకం కింద పెన్షన్లు రెట్టింపు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

1257
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles