విద్యార్థులు ఇష్టపడి, పట్టుదలతో చదవాలి: హరీశ్‌రావు

Sat,August 4, 2018 03:56 PM

harish rao distribution study material at Parigi

రంగారెడ్డి: పరిగిలో వీఆర్‌వో, కానిస్టేబుల్ ఉచిత మెటీరియల్‌ను మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.... నగరంలో కోచింగ్ తీసుకోవాలంటే రూ.30 వేల వరకు ఖర్చు వస్తుంది. టీఆర్‌ఎస్ ఆధ్వరంలో మనోహర్‌రెడ్డి మీకు మంచి అవకాశం కల్పించారు. ఉద్యోగాలకు సిద్దం అయ్యే వారికి ఆత్మవిశ్వాసం అవసరం. ఆత్మవిశ్వాసంతోనే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించారు. క్రమ పద్దతిలో చదివి ఉద్యోగాలు సాధించాలి. పోలీస్ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాం. ఎవరి జిల్లాలోని ఉద్యోగాలు వారికే దక్కేలని సీఎం కేసీఆర్ ప్రధానిని కలుస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో పంచాయితీ సెక్రటరీల ఉద్యోగాలకు నోటిఫికేషన్ కాబోతోంది. విద్యార్థులు ఇష్టపడి, పట్టుదలతో చదవాలని పిలుపునిచ్చారు.

1050
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS