దేవుణ్ణి పూజిద్దాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: హరీశ్ రావు

Wed,September 12, 2018 01:02 PM

Harish rao Distributes soil ganapati statues in siddipet

సిద్దిపేట: ప్రతీ పండుగ పర్యావరణ పరిరక్షణకేనని, ప్రకృతి ప్రేమించేదేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో అమర్ నాథ్ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో మట్టి గణపతుల ఉచితీ పంపిణీ కార్యక్రమానికి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మన చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనన్నారు. పట్టణ ప్రజలు ప్రతి ఇంటిలో మట్టి గణపతినే పూజించాలని కోరారు. సిద్దిపేట లో పర్యావరణాన్ని పరిరక్షణలో ప్రజల్లో చైతన్యం వచ్చింది. వచ్చే వినాయక చవితి నాటికి సిద్దిపేట లో నిమర్జన చెరువు ఏర్పాటు చేస్తామన్నారు. అమరనాథ్ సేవ సమితి సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చొరవ చూపడం అభినందనీయమని హరీశ్ రావు అన్నారు.


1142
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles