రాష్ట్రం గొప్ప ఇంజినీర్‌ను కోల్పోయింది : హరీష్

Sat,April 29, 2017 01:01 PM

Harish Rao condolence to R Vidyasagar rao death

హైదరాబాద్ : నీటిరంగ నిపుణుడు ఆర్ విద్యాసాగర్‌రావు మృతిపట్ల నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సంతాపం తెలిపారు. హరీష్‌రావు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్రం గొప్ప ఇంజినీర్, సాగునీటి శాస్త్రవేత్తను కోల్పోయిందని ఆవేదన చెందారు. విద్యాసాగర్‌రావు రాష్ట్ర జలవనరులపై తమకు ఎంతో అవగాహన కల్పించారని తెలిపారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలన్న సీఎం కేసీఆర్‌కు విద్యాసాగర్‌రావు వెన్నుదన్నుగా నిలబడ్డారని పేర్కొన్నారు. నీళ్లు - నిజాలు పేరుతో రాష్ర్టానికి జరిగిన అన్యాయాన్ని కళ్లకుకట్టినట్లు చూపారని తెలిపారు. కోటి ఎకరాల సాగు లక్ష్య సాధన కోసం తమకెన్నో సూచనలు చేశారని చెప్పారు. మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టినప్పుడు విద్యాసాగర్‌రావు హర్షం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యాసాగర్‌రావు లేని లోటు ప్రభుత్వానికి, తెలంగాణ సమాజానికి పూడ్చలేనిదన్నారు. విద్యాసాగర్‌రావును బతికించుకోవడానికి సీఎం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.

1312
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles