చెరువుకట్టపై మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు

Sat,June 3, 2017 01:24 PM

Harish Rao birth day celebrations by farmers

వరంగల్ : నర్సంపేట నియోజకవర్గంలోని రైతన్నలు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలను చెరువుకట్టపై జరిపారు. నల్లబెల్లిలోని వెంకటపాలెం చెరువుకట్టపై రైతులు, యువకులు కలిసి కేక్ కట్ చేసి హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. చెరువుల అభివృద్ధి కోసం నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. నిరంతరం రైతుల సంక్షేమం కోసం పరితపిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా రెండు పంటలకు నీరందించేందుకు చేస్తున్న ప్రయత్నం గొప్పగా ఉందన్నారు. ఈ క్రమంలోనే చెరువుల కింద పంటలు సమృద్ధిగా పండుతున్నాయని పేర్కొన్నారు. చెరువుల అభివృద్ధికి హరీష్ రావు నిరంతరం కృషి చేస్తున్నందున.. ఆయన జన్మదిన వేడుకలు చెరువు కట్టపై జరిపామని రైతులు చెప్పారు.

ఈ కార్యక్రమంలో రైతులు కొనుకటి వీరస్వామి, తాడభోయిన కొంరెల్లి, పెంతల కుమార్, ఎద్దు కొమురయ్య, తెలంగాణా విజయ్, మామిండ్ల అమరేందర్ రెడ్డి, కాట్రోజు రాజుయాదవ్, నాగెల్లి శ్రీదర్, సోడా మల్లేష్, తాడబోయిన వినయ్, రాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

1225
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles