సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఐదుసార్లు గెలిచా..

Thu,November 8, 2018 05:25 PM

Harish rao attends yadavs athmiya sabha in siddipet

సిద్దిపేట: ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఇప్పటికీ ఐదుసార్లు గెలిచాను.. కేసీఆర్ ఆశీస్సులతో సిద్దిపేటను చాలా అభివృద్ధి చేసుకున్నాం.. అపోలో ఆసుపత్రి మాదిరిగా ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించుకున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవులు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ..సిద్దిపేట అంటే మిమ్మల్ని గౌరవించే విధంగా నేను చేసిన. ఎంత ఎదిగితే అంత ఒదగాలి అని కేసీఆర్ నేర్పిన విధంగా నడుచుకున్నా. మీ బిడ్డగా మల్లన్న దేవుని దయతో మీ సేవ చేశానని మంత్రి హరీశ్ రావు అన్నారు. వానాకాలం వస్తే ఉశిల్లు వస్తాయి, ఎన్నికలు వస్తే కాంగ్రెస్ వాళ్ళు వస్తారని హరీశ్ రావు ఎద్దేశా చేశారు.

కేసీఆర్ ఆశీస్సులతో కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర పడింది. మళ్ళీ వానాకాలం నాటికి కాళేశ్వరం నీళ్ళు తెచ్చి చెరువులు, కుంటలు నింపి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు. మంచి మెజారిటీ అందించి సిద్దిపేటను కేసీఆర్ కు ఒక బహుమతిగా అందించాలని ప్రజలను కోరారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను మళ్ళీ చంద్రబాబు చేతిలో పెడుదామా...? అని ప్రజలను అడిగారు. టీఆర్ఎస్ జనం బాట పడితే, కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీ బాట పట్టారు. చంద్రబాబు కాంగ్రెస్ ముసుగులో మళ్లీ తెలంగాణకు వస్తున్నడు. కాంగ్రెస్ వాళ్లకు కుర్చీల కొట్లాట తప్ప, ప్రజల గోస పట్టదని హరీశ్ రావు మండిపడ్డారు. ఒక్క నెల రోజులు మీరు కష్టపడితే ఐదు సంవత్సరాలు నేను కష్టపడుతానని హరీష్ రావు స్పష్టం చేశారు.

3177
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS