హరికృష్ణ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నారు: నల్గొండ ఎస్పీ

Wed,August 29, 2018 10:36 AM

Harikrishna was driving at a speed of 160 km per hour says Nalgonda SP Ranganath

హైదరాబాద్: టీడీపీ మాజీ ఎంపీ, సినీ నటుడు హరికృష్ణ వాహనం ప్రమాదానికి గురైన సమయంలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఉన్నదని నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. బుధవారం ఉదయం 6.15 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి ఉదయం 4.30 గంటలకు బయలుదేరిన హరికృష్ణ నెల్లూరు వెళ్తున్నట్లు తెలిపారు. చిట్యాల దాటిన తర్వాత నార్కెట్‌పల్లి సమీపంలో గుంటూరు హైవేపై హరికృష్ణ కారు ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. పోలీస్ 12వ బెటాలియన్ గ్రౌండ్స్ దగ్గర కారు నియంత్రణ కోల్పోయింది. పక్కనే ఉన్న రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో కారు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఉంది. వర్షాల కారణంగా రోడ్డు కూడా చిత్తడిగా ఉండటంతో కారు అవతలి వైపునకు ఎగిరి ఎదురుగా వచ్చే వాహనాన్ని ఢీకొట్టింది అని రంగనాథ్ తెలిపారు. ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

5680
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles