మూడు సంఖ్యను హరికృష్ణ అశుభంగా భావించేవారట!

Wed,August 29, 2018 12:44 PM

harikrishna do not like number 3 says his friend Prakash

హైదరాబాద్ : సినీ నటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ మృతితో ఆయన స్నేహితులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. హరికృష్ణ స్నేహితుడు ప్రకాశ్ మీడియాతో మాట్లాడుతూ.. హరి బయటకు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్త పడేవారు. ఆయన ఎప్పుడు బయటకెళ్లిన నలుగురు ఉండేలా చూసుకునేవారు. మూడు సంఖ్యను హరి అశుభంగా భావించేవారు. నెల్లూరులో పెళ్లి ఉందని నాకు చెప్పాడు. హరి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్నాను. ఇంతలోనే ఆయన మృతి చెందినట్లు వార్త వినిపించింది. నలుగురం కలిసి పెళ్లికి వెళ్దామనుకున్నాం. కానీ ఆయన మరో ఇద్దరితో కలిసి వెళ్లారో నాకు అర్థం కావడం లేదని ప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు. హరికృష్ణ వెంట అరికపూడి శివాజీ, వెంకట్రావ్‌లు వెళ్లిన విషయం తెలిసిందే.

6063
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles