హరికృష్ణ కారు ప్రమాదం ఎలా జరిగిందంటే?

Wed,August 29, 2018 12:18 PM

harikrishna dies after road accident at Anneparti

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. ప్రమాదానికి గల కారణాలను కారులో ఉన్న హరికృష్ణ స్నేహితుడు శివాజీ మీడియాకు వివరించారు. ఇవాళ తెల్లవారుజామున 4.30 గంటలకు హరికృష్ణతో పాటు తాను(శివాజీ), మరో స్నేహితుడు వెంకట్రావ్ కలిసి నెల్లూరులో ఓ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు బయల్దేరాం. హరికృష్ణనే డ్రైవింగ్ చేశారు. అన్నెపర్తి వద్దకు రాగానే తమ కారు రాయి ఎక్కడంతో.. డివైడర్ ఎక్కి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. తాను, వెంకట్రావ్ సీటు బెల్టు ధరించాం. కానీ హరికృష్ణ సీటు బెల్టు ధరించలేదు. తామిద్దరం కారులోనే ఉండిపోయాం. హరికృష్ణ కారులో నుంచి 30 అడుగుల దూరంలో పడిపోయారు. తాను కారులోని లెఫ్ట్ సీటులో కూర్చున్నాను. బ్యాక్ సీటులో వెంకట్రావ్ కూర్చున్నారని శివాజీ తెలిపారు. అయితే హరికృష్ణ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతోనే.. తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు నిర్ధారించారు. తలకు తీవ్ర గాయం కావడంతో హరికృష్ణ మృతి చెందారు. ఇక అవతలి కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కారు రోడ్డు పక్కనే ఉన్న ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది.

7570
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles