15 నుంచి ఒంటిపూట బడులుTue,March 13, 2018 09:27 PM

15 నుంచి ఒంటిపూట బడులు

హైదరాబాద్ : వేసవి సమీపిస్తుండటంతో, రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం నుంచి పాఠశాలలు ఒంటిపూట నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటనర్సమ్మ ఆదేశాలు జారీచేశారు. అకాడమిక్ క్యాలెండర్‌లో సూచించిన మేరకు ప్రతీ సంవత్సరం మాధిరిగానే, ఈ సారి మార్చి 15 నుంచి పాఠశాలలను ఒంటిపూట నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా డీఈఓ పాఠశాలలకు ఉత్తర్వులు వెలువరించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలన్ని విధిగా ఈ ఆదేశాన్ని పాటించాలన్నారు. ఉదయం 8 : 00 గంటల నుంచి మధ్యాహ్నం 12 : 30 గంటల వరకు మాత్రమే పాఠశాలలను నిర్వహించాలన్నారు. ఒంటి పూట నిర్వహించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. వేసవితాపం, ఉష్ణోగ్రతల బారి నుంచి విద్యార్థులకు ఉపశమనం కలిగించడానికి పాఠశాలలన్నింటిని ఉదయం పూట మాత్రమే నిర్వహించాలని ఆదేశించారు.

2067
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS