జీవీకే ఇఎంఆర్‌ఐలో ఉద్యోగ నియామకాలు

Tue,July 23, 2019 10:39 PM

gvk emri jobs hyderabad

హైదరాబాద్ : జీవీకే ఇఎంఆర్‌ఐ కాల్‌సెంటర్లలో ఎమర్జెన్సీ రెస్పాడ్స్ ఆఫీసర్స్‌గా పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దేవరయాంజల్ ఇఎంఆర్‌ఐ హెచ్‌ఆర్ హెడ్ సుహాస్ చరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో ఈ నెల 25న నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. గ్రాడ్యూయేషన్ పాస్ లేదా ఫెయిల్ విద్యార్హతలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ కాల్ సెంటర్‌లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. 1 నుంచి రెండు సంవత్సరాల అనుభవంతో పాటు ఫ్రెషర్స్ కూడా అవకాశం ఉందన్నారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీలలో చదవడం, రాయడం వచ్చి ఉండాలన్నారు. శరీర దారుడ్యం కలిగి ఉండాలన్నారు. సికింద్రాబాద్ దేవరయాంజల్ జివికె ఇఎంఆర్‌ఐ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇతర వివరాల కొరకు 9000012214, 8143335660లలో సంప్రదించవచ్చన్నారు.

437
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles