చురుకైన మంత్రి.. జగదీష్ రెడ్డి

Tue,February 19, 2019 12:17 PM

Guntakandla Jagadish reddy take Oath as Minister

పూర్తి పేరు : గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి
పుట్టిన తేదీ : 18-07-1965
తల్లిదండ్రులు : సావిత్రమ్మ, చంద్రారెడ్డి
భార్య : సునీత
పిల్లలు : కుమారుడు వేమన్‌ రెడ్డి, కూతురు లహరి
స్వగ్రామం : నాగారం(నాగారం మండలం)
విద్యార్హత : బీఏ, బీఎల్‌
చేపట్టిన శాఖ: విద్యాశాఖ


-ఉమ్మడి జిల్లా నుంచి రెండోసారి మంత్రిగా జగదీష్‌రెడ్డి
-గుంటకండ్లకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీలు, ఎమ్మెల్యేలు
-నమ్మకం సమన్వయం, ఉద్యమ నేపథ్యమే సానుకూలతలు
-టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌తోనే ఉన్న జగదీష్‌రెడ్డి
-తెలంగాణ తొలి కేబినెట్‌లోనూ మంత్రిగా విజయవంతం


ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆసాంతం అంకితభావంతో నిండిన చురుకైన పాత్ర.. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచీ నమ్మకంగా పని చేస్తూ చాటుకున్న ప్రత్యేక ముద్ర.. ఉద్యమ అధినేత, బంగారు తెలంగాణ నిర్మాత, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల విధేయత.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని టీఆర్‌ఎస్ నాయకులను సమన్వయం చేస్తూ పలు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించిన ఘనత.. తెలంగాణ తొలి కేబినెట్‌లో పూర్తి కాలం మంత్రి బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన చరిత.. వెరసి ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్‌లో రెండోసారి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డికి అవకాశం దక్కింది. 2014 జూన్2న రాష్ట్ర ఆవిర్భావంతో పాటే ఏర్పాటైన తెలంగాణ తొలి కేబినెట్‌లోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పూర్తికాలం ప్రాతినిధ్యం వహించిన జగదీష్‌రెడ్డికే రెండో కేబినెట్‌లోనూ సీఎం కేసీఆర్ మళ్లీ అవకాశం కల్పించడం విశేషం. గత ప్రభుత్వంలో తొలుత విద్యాశాఖ, ఆ తర్వాత విద్యుత్ శాఖతోపాటు ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రిగా జగదీష్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డికి అవకాశం దక్కింది. సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రానికి చెందిన గుంటకండ్ల జగదీష్‌రెడ్డి.. బీఏ, బీఎల్ పూర్తి చేసి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షతో 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూనే పార్టీ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితమైన అనుచరుడిగా ఎదిగారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధి, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేశారు. 2001 నుంచి పలు ఎన్నికలు, ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. 2009లో హుజూర్‌నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయినా.. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు సూర్యాపేట నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

తొలి కేబినెట్‌లో విద్యుత్ శాఖ మంత్రిగా విజయం...
తెలంగాణ ఉద్యమ అధినేత కేసీఆర్‌కు అత్యంత అనుంగ అనుచరుడిగా పేరున్న గుంటకండ్ల జగదీష్‌రెడ్డి.. కేసీఆర్ తొలి కేబినెట్‌లో విద్యా శాఖ మంత్రిగా మొదట పదవీ బాధ్యతలు చేపట్టారు. తర్వాత కొంత కాలానికే విద్యా శాఖ నుంచి విద్యుత్ శాఖకు మార్చిన కేసీఆర్.. జగదీష్‌రెడ్డి బాధ్యతలను మరింత పెంచారు. ఇటు గృహాలు, పరిశ్రమలతోపాటు అటు వ్యవసాయానికి సైతం 24గంటల విద్యుత్ సరఫరా అందించి అందరి మన్ననలూ పొందిన తెలంగాణ ప్రభుత్వ ఘనత వెనుక మంత్రిగా జగదీష్‌రెడ్డి కృషి, కేసీఆర్ ప్రోత్సాహం ఎంతో ఉంది. 2013లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జీగా బాధ్యతలు అందుకొని గత ఎన్నికల్లో ఆరు స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన జగదీష్‌రెడ్డి.. తాజాగా గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు 9స్థానాల్లో గెలిచే విధంగా వ్యూహాత్మక అడుగులు వేశారు. పాత, కొత్త నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. గత ప్రభుత్వంలో పూర్తి కాలం మంత్రిగా పని చేసినా ఎక్కడా మచ్చలేని పాలన అందించిన ఘనత జగదీష్‌రెడ్డి సొంతం. అధినేత కేసీఆర్‌కు విధేయుడిగా.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. గతంలో ఉమ్మడి జిల్లా అంతటా ఏ మంత్రి కూడా పర్యటించనంతగా తిరిగి, ప్రతి నిత్యం జిల్లా అభివృద్ధి కోసం చేసిన ఆయన కృషికి ఫలితంగానే మరోసారి మంత్రి పదవి దక్కింది.

2388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles