50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో

Mon,May 20, 2019 09:07 PM

Gundala mpdo caught red handed by ACB officers in bhadradri kothagudem

భద్రాద్రి కొత్తగూడెం: మరుగుదొడ్డి నిర్మాణాలకు సంబంధించిన రూ.50 వేలు లంచం తీసుకుంటూ గుండాల ఎంపీడీఓ అంబాల శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. ఏసీబీ అధికారులు తెలిపిన సమాచారం మేరకు.. గుండాల మండలంలో మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు రూ.6.50 లక్షలను కాంట్రాక్టర్‌కు విడుదల చేసేందుకు ఎంపీడీవో రూ.50 వేలు లంచం అడిగారు. నెల రోజులుగా కాంట్రాక్టర్ బిల్లులు విడుదల చేయాలని కోరుతున్నా ఎంపీడీవో లంచం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు.

దీంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం ఏసీబీ అధికారుల సూచనతో గుండాల మండల పరిధిలోని కాచనపల్లి ఎస్బీఐ వద్దకు కాంట్రాక్టర్ వచ్చాడు. అక్కడ ఎంపీడీవో కాంట్రాక్టర్ చేతి నుంచి రూ.50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎంపీడీవోను అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లా కేంద్రానికి తరలించారు.

2694
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles