రైతు బంధు చెక్కును ప్రభుత్వానికి ఇచ్చేసిన గుజరాత్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్

Wed,May 16, 2018 09:24 PM

Gujarat Highcourt chief justice gives up rythu bandhu cheque

మెదక్: మే 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు పథకం అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. చాలా మంది రైతులు తమకు వచ్చిన చెక్కును స్వచ్ఛందంగా ప్రభుత్వానికి లేదంటే రైతు సమన్వయ సమితులకు విరాళంగా ఇచ్చేస్తున్నారు. ఈనేపథ్యంలో గుజరాత్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ సుభాష్ రెడ్డి తనకు వచ్చిన రూ. 78,350 విలువైన రైతు బంధు చెక్కును ప్రభుత్వానికి అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. జిల్లాలోని చిన్నశంకరంపేట్ మండలం కామరం గ్రామానికి చెందిన సుభాష్ రెడ్డి 19 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. ఆ భూమికి వచ్చిన రైతు బంధు చెక్కును తన వ్యవసాయ పనులు చూసుకొనే సాయికుమార్ అనే వ్యక్తికి ఇచ్చి తహసిల్దారుకు సమర్పించాల్సిందిగా కోరారు. దీంతో సాయికుమార్ పంట చెక్కును తీసుకెళ్లి తహశీల్దారుకు సమర్పించాడు.

5711
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles