వేయిస్తంభాల ఆలయంలో ఘనంగా గుడి సంబురాలు

Wed,January 16, 2019 10:45 PM

Gudi sambaralu held in thousand pillar temple hanamkonda

వరంగల్: హన్మకొండలోని చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఇవాళ గుడి సంబురాలు కనులపండువగా జరిగాయి. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారులు పాపారావు, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాంచందర్‌ నాయక్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్సార్ విద్యాసంస్థల ఛైర్మన్ వరదారెడ్డి, కుడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి, వేయిస్తంభాల గుడి ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నృత్య ప్రదర్శన ద్వారా అందరినీ ఆకట్టుకునేలా ప్రముఖ నృత్య కళాకారిణి దీపికారెడ్డి వారి బృందం నిర్వహించింది. ఈ సందర్భంగా దీపికారెడ్డి మాట్లాడుతూ.. నాట్యరాజ వేయిస్తంభాల గుడి శివాలయం ప్రాంగణంలో నాట్యం చేయడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్ మాట్లాడుతూ.. కళాకారిణి దీపికారెడ్డి తెలంగాణ సంస్కృతిని తన కళానృత్య ప్రదర్శన ద్వారా తెలియజేశారన్నారు.

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. కళావైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారన్నారు. వరంగల్ చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలన్నారు. భావితరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం గుడి సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

1463
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles