ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు మినహాయింపు ఇవ్వాలి: ఈటల

Fri,October 6, 2017 09:59 PM

GST excluding on going projects says minister eetela rajender

ఢిల్లీ: ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు జీఎస్టీ పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని జీఎస్టీ కౌన్సిల్‌కు మరోసారి విజ్ఞప్తి చేసినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మంత్రి ఈటల మాట్లాడుతూ.. రాష్ట్రం తరపున సమస్యలను, నిర్ధిష్టమైన అంశాలను జీఎస్టీ సమావేశంలో లేవనెత్తామన్నారు. గత సమావేశాల్లో తాము లేవనెత్తిన అంశాలనే ఇప్పుడు అన్ని రాష్ర్టాలు లేవనెత్తున్నాయని చెప్పారు. తాము గతంలో లేవనెత్తినటువంటి అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ దృష్టి పెట్టినందుకు సంతోషమన్నారు. కొత్త ప్రాజెక్టులను 12 శాతం నుంచి 5 శాతం శ్లాబ్‌లోకి తీసుకురావాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. తాగునీటి పైపులైన్ల పైన గతంలో ఎలాంటి పన్నులు ఉండేవి కావని.. ఇప్పుడు కూడా యధాతథంగా ఉండాలని కోరామన్నారు. 14 శాతం కన్నా తక్కువ గ్రోత్ రేట్ ఉన్న రాష్ర్టాలకే ఇప్పటి వరకు జీఎస్టీ నష్టపరిహారం ఇచ్చారన్నారు. కాగా తెలంగాణ 22 శాతం గ్రోత్ రేట్‌లో ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు నష్టపరిహారం అంశం తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు.

930
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles