గ్రూప్ 4 ప్రాథమిక కీ విడుదల

Sun,October 21, 2018 09:36 AM

Group-4 key released

హైదరాబాద్: గ్రూప్ 4, జీహెచ్‌ఎంసీ బిల్‌కలెక్టర్, బేవరేజెస్ కార్పొరేషన్‌లో పోస్టులు, టీఎస్‌ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ప్రాథమిక కీని తమ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. కీ పై అభ్యంతరాలుంటే 23 నుంచి 29 వరకు నిర్దేశిత లింక్‌ద్వారా పంపాలని కోరింది. అలాగే టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లో భాగంగా బయోలాజికల్ సైన్స్ అభ్యర్థులకు 24న రెండో విడుత ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 62 మంది అభ్యర్థులను రెండో విడుత పరిశీలనకు ఎంపిక చేశామని, టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ధ్రువపత్రాలను పరిశీలించనున్నామని కమిషన్ పేర్కొన్నది. పూర్తివివరాలకు తమ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

3807
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles