త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్

Tue,December 18, 2018 04:49 PM

Group 1 Notification will come soon says TSPSC

హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ -1 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు అందించింది. జోన్ల విభజన కారణంగా నిలిచిపోయిన గ్రూప్ -1 నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చేస్తామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ వాణి ప్రసాద్ ప్రకటించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడి ఇవాళ్టికి నాలుగేళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా వాణి ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు 38 వేల 59 పోస్టుల నియామకానికి ప్రభుత్వం అనుమతించింది. 101 నోటిఫికేషన్ల ద్వారా ఇప్పటి వరకు 16 వేల 50 పోస్టులను భర్తీ చేశాం. 20 వేల 260 పోస్టులకు సంబంధించి నియామక ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ కారణాల వల్ల 1877 పోస్టుల భర్తీ నిలిచిపోయింది. ఇప్పటి వరకు టీఎస్ నిర్వహించిన అన్ని పరీక్షలకు 34 లక్షల మంది హాజరయ్యారు. టీఆర్టీ(టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్)కి సంబంధించి ప్రాసెస్ కొనసాగుతోంది. త్వరలో కోర్టు అనుమతితో ఫలితాలు విడుదల చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

4811
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles