బోరుబావి నుంచి ఉబికివస్తున్న నీరు..: వీడియో

Mon,July 22, 2019 11:30 AM

 Ground water  level is increased with the kaleshwaram project

పెద్ద‌ప‌ల్లి: ఇన్నాళ్లూ నీళ్లు లేక ఎడారిగా ఉన్న గోదావరి, కాళేశ్వరం నీటితో ఎదురీదుతున్నది. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి వచ్చి చేరుతున్న నీటితో రెండు ఒడ్లను తాకుతూ ప్రవహిస్తున్నది. నిండుకుండలా మారిన గోదారమ్మను చూసి రైతాంగం తరిస్తున్నది. దిగువకు ఉరకలెత్తే గోదావరికి రివర్స్ గేర్ వేసిన ఇంజినీరింగ్ అద్భుతాన్ని ఆశ్చర్యంగా తిలకిస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీ నుంచి మొదలైన గోదారి ప్రవాహం.. కన్నెపల్లి పంప్‌హౌప్ ద్వారా అన్నారం బ్యారేజీని నింపుకుంటూ 74కిలో మీటర్లు ప్రయాణించి అన్నా రం పంప్‌హౌస్ హెడ్ రెగ్యులేటరీ వరకూ చేరింది. దీంతో అన్నారం బ్యారేజీ నుంచి సుందిళ్ల వ‌ర‌కు గోదావ‌రిలో నీరు నిండుకుండ‌లా మారింది. కాటారం మండ‌లం దామెర‌కుంట గ్రామంలో ఓ రైతు పొలంలో వేసిన బోరు నుంచి నీరు ఉబికివస్తుండటంతో ప్రజలు భారీగా తరలివ చ్చారు. కాళేశ్వ‌రం జ‌లాల‌తో భూగర్భ జలమట్టం పెరగడంతో బోరు నుంచి పైకి నీరు వ స్తోంది.

1664
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles