గ్రామపంచాయితీ ట్రైబ్యునల్ ఏర్పాటు

Thu,September 19, 2019 02:24 PM

హైదరాబాద్: గ్రామపంచాయతీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రైబ్యునల్‌కు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టం 141 సెక్షన్ ప్రకారం ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీల వివాదాల అప్పీళ్లను విచారించేందుకు ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. చైర్మన్, ఇద్దరు సభ్యులతో ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. ఛైర్మన్, సభ్యుల పదవీకాలం మూడేళ్లపాటు కొనసాగనుంది.

524
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles