నాగోబా జాతర.. రేపు ప్రభుత్వ సెలవు

Wed,February 6, 2019 02:05 PM

Govt Holiday on February 07 due to Nagoba Jatara in Adilabad dist

ఆదిలాబాద్ : నాగోబా జాతర, దర్బార్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాకు రేపు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు సెలవు ప్రకటనతో మార్చి 9న పనిదినంగా పరిగణించాలని కలెక్టర్ ఆదేశించారు.

మెస్రం వంశీయులు సోమవారం రాత్రి నిర్వహించిన మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర మంగళవారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. మహాపూజల అనంతరం ఆచారం ప్రకారం కొత్తకోడళ్లకు నాగోబా సన్నిధిలో(బేటింగ్) పరిచయవేదిక నిర్వహించారు. అనంతరం వారికి నాగోబాను దర్శించుకునే అవకాశాన్ని కల్పించారు. ఆలయ సమీపంలోని గోవాడ్‌లో మెస్రం వంశీయుల మహిళల ఆధ్వర్యంలో నైవేద్యాలు తయారు చేసి దీపాలు వెలిగించి సంప్రదాయ పూజలు చేశారు.

నాగోబాను మంగళవారం ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తూతోపాటు నిర్మల్ కలెక్టర్ ప్రశాంతి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా క్రిస్టినా జడ్ చోంగ్తూ మాట్లాడుతూ.. తెలంగాణలో కెస్లాపూర్ నాగోబా జాత ర రెండో అతిపెద్ద జాతరగా గుర్తించారన్నారు. నాగోబా జాతరను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొని గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిధులు మంజూరు చేయిస్తామన్నారు. లండన్‌కు చెందిన మైకేల్ యోర్క్ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఈ సందర్భంగా క్రిస్టినా ప్రారంభించారు.

5464
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles