తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

Wed,October 23, 2019 12:12 PM

హైదరాబాద్: తిరుమల శ్రీవారిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసారు..అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా..ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ హోదాలో మొదటిసారిగా స్వామి ఆశీస్సులు పోందడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వామి వారి దర్శనం‌కు వచ్చే భక్తుల కోసం టీటీడీ ఏర్పాట్లు చాలా బాగున్నాయని అభినందించారు.



600
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles