యాదాద్రిలో గవర్నర్ దంపతుల ప్రత్యేక పూజలు

Sun,February 10, 2019 06:38 PM

యాదాద్రి భువనగిరి: గవర్నర్ నరసింహన్ దంపతులు ఇవాళ సాయంత్రం యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్లారు. సాయంత్రం 5 గంటలకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు ఆలయ ఈవో గీత, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గవర్నర్ రాక సందర్భంగా యాదాద్రి ముఖ మండపాన్ని స్వాగత తోరణాలు, రంగురంగుల పూలతో అలంకరణ చేశారు. యాదాద్రి జోన్ డీసీసీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


వసంత పంచమి సందర్భంగా గవర్నర్ దంపతులు యాదాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి శ్రీవారి ప్రసాదం అందజేశారు. గవర్నర్ వెంట ఎమ్మెల్యే సునిత ఉన్నారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్న. ఆలయ అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పర్యవేక్షించి వెళ్లారు. పనులు బాగానే జరుగుతున్నాయి. త్వరలోనే స్వామి వారు స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిగా దర్శనమిస్తారు -గవర్నర్ నరసింహన్

1724
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles