సరస్వతి.. లక్ష్మీ అయిపోయింది : గవర్నర్ నరసింహన్

Tue,July 3, 2018 12:25 PM

governor Narasimhan participated in PSTU 14th convocation

హైదరాబాద్ : ప్రస్తుతం చదువుల తల్లి సరస్వతి.. లక్ష్మీ అయిపోయిందని తెలుగు రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా గవర్నర్ నరసింహాన్ హాజరై ప్రసంగించారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కృషి అభినందనీయమన్నారు. తెలుగు గొప్ప భాష అని కొనియాడారు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా విద్యాసంస్థలు వెలుస్తున్నాయన్నారు. నేడు డిగ్రీలు అందుకుంటున్న విద్యార్థినీవిద్యార్థులందరూ.. సామాన్యుల నుంచి మాన్యుల స్థాయికి ఎదిగారు. విశ్వవిద్యాలయాల వల్లే సామాన్యులు.. మాన్యులు అవుతారని ఆయన పేర్కొన్నారు.

నేను అనేది పోవాలి.. మేము అనేది నినాదం రావాలన్నారు. తెలుగు భాషను తప్పకుండా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. పిల్లలకు మాతృభాష నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. దేశ భవిష్యత్ విద్యార్థులపైనే ఆధారపడి ఉందన్నారు. తెలుగు యూనివర్సిటీ విద్యార్థులు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని.. ఆ గ్రామాల్లో విద్య, సంస్కృతి, కూచిపూడితో పాటు ఇతర కళలను నేర్పించాలి. అప్పుడే ఇప్పుడు తీసుకుంటున్న డిగ్రీలకు విలువ ఉంటుందన్నారు.

హాయ్, బాయ్ పోయి.. నమస్కారం తప్పనిసరిగా చెప్పేలా పిల్లలను తయారు చేయాలి. రష్యా, చైనా లాంటి దేశాల్లో వారు వారి మాతృభాషల్లోనే మాట్లాడుకుంటున్నారని గవర్నర్ గుర్తు చేశారు. తెలుగును అందరూ నేర్చుకోవాలి. తన మాతృభాష అరవం.. ఆ భాష ఇక్కడ మాట్లాడితే మీకు అర్థం కాదు. అర్థం కానీ భాష మాట్లాడి వ్యర్థం. అందుకే అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడటం నేర్చుకోవడం తప్పనిసరి చేసుకోవాలి. కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. దీంతో పిల్లలు చెడిపోతున్నారు. వసుదైక కుటుంబం పిల్లలకు ఎంతో మంచిందని గవర్నర్ తెలిపారు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పని చేయకూడదు. సామాజిక సేవ లక్ష్యంగా పని చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. స్వచ్ఛత కోసం అందరూ కృషి చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు.

3435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles